Ex Minister Babu Mohan |తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం పొందిన బాబూమోహన్
బాబూ మోహన్ న్యూ పొలిటికల్ జర్నీ.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన మాజీ మంత్రి..
Hyderabad : రాష్ట్రంలో ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, అందోల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఇటీవల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడును కలిశారు. ఉమ్మిడి ఏపీలో 15 ఏళ్లకు పైగా టీడీపీలో ఉన్న ప్రస్తుతం టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు తెలుపారు. అందుకు సంబంధించిన ఫొటో విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, మూడుసార్లు అందోల్ ఎమ్మెల్యేగా, అంతకు మించి ఒకప్పటి స్టార్ కమెడియన్, ఇలా బాబూమోహన్ బయోడెటా గురించి చెప్పుకుంటే చాలానే ఉంటుంది. ఈయన పేరుచెబితే.. తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపట్టని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదు.. అయితే.. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ అంతా అనుకున్నట్లుగానే సొంత గూటికి చేరారు.. బాబూమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన ఓ ఫొటోను విడుదల చేశారు. తాను సభ్యత్వం తీసుకున్న ఫొటోను బాబూమోహన్ మంగళవారం విడుదల చేశారు.
Leave A Comment